
అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య గురువారం మధ్యాహ్నం ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. భాజపా సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ ఎక్స్(ట్విటర్)లో ఈ ఫొటోను పంచుకున్నారు. 51 అంగుళాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహానికి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
सियावर रामचंद्र की जय।????
प्रतिक्षा 22 जनवरी 2024..
जय श्रीराम ????#RamMandirPranPratishta #RamLalla #RamMandir #RamMandirAyodhya #JaiShreeRam #ShriRam #Ayodhya #राम pic.twitter.com/0c6vO6ueJO
— Prakash Javadekar (@PrakashJavdekar) January 18, 2024
రామ్‌లల్లా విశిష్టతలివే..
► అయోధ్య రామాలయంలో ప్రతిష్టించబోయే బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు.
► కృష్ణ శిల(నల్ల రాయి) నుంచి ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు.
► రామ్‌లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు.
► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించారు.
► గర్భాలయంలో నిల్చున్న రూపంలోనే రామ్‌లల్లా దర్శనమిస్తాడు.
► విగ్రహ ప్రాణప్రతిష్ట ఈ నెల 22వ తేదీన.. సోమవారం మధ్యాహ్నం 12.20 గంట నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది.
► ప్రాణప్రతిష్ట సందర్భంగా గర్భగుడిలోకి కొందరికే ప్రవేశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ మహారాజ్ మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ట్రస్టీలు ‘గర్భగృహం’ అని పిలిచే పవిత్ర ప్రాంతంలో ఆసీనులవుతారు.
► ఆలయ ప్రాణప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన యజమాని(కర్త)గావ్యవహరిస్తారు.
► ఈ నెల 23వ తేదీ నుంచి గర్భాలయంలో బాలరాముడిని సామాన్య భక్తులు దర్శించుకోవచ్చు.



