News

స్వయంసేవక్ పద్మనాభ్ బి ఆచార్య కన్నుమూత; నివాళులు అర్పించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

320views

నాగాలాండ్ మాజీ గవర్నర్‌గా పనిచేసిన పద్మనాభ బాలకృష్ణ ఆచార్య శుక్రవారం మహారాష్ట్రలోని అంధేరి పశ్చిమంలో తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.ఆయనకు 92 ఏళ్లు.పిబిగా ప్రసిద్ధి చెందిన ఆచార్య ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర, మణిపూర్ మరియు అరుణాచల్ ప్రదేశ్ కు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు.ఆయన మృతికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా.మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే సంతాపాన్ని తెలిపారు.

శ్రీ ఆచార్య కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. శ్రీ పద్మనాబ్ జీ ఒక గొప్ప స్వయం సేవక్ మరియు నిబద్ధత కలిగిన కార్యకర్త. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఆయన అనేక వినూత్న కార్యకలాపాలను ప్రవేశపెట్టారు. అలాగే ముంబై విశ్వవిద్యాలయం సెనేట్‌లో కూడా పనిచేశారు. శ్రీ ఆచార్య విద్య, జాతీయ సమైక్యత, సంస్కృతి, సేవ మరియు అభివృద్ధి వంటి వివిధ రంగాలలో అత్యుత్తమ సహకారం అందించారు. ఈశాన్య రాష్ట్రాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారు. ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తూ, పద్మనాభ బాలకృష్ణ ఆచార్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. ఓం శాంతి. అని తమ సంతాపాన్ని తెలిపారు.