News

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా అరిందమ్‌ బాగ్చీ

333views

ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంభోజ్‌ స్థానంలో సీనియర్‌ దౌత్యవేత్త అరిందమ్‌ బాగ్చీ నియమితులయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆయన సంబంధిత బాధ్యతలు చేపడతారని పేర్కొంది. బాగ్చీ 1995 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. ఇన్నాళ్లూ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో క్రొయేషియాలో భారత రాయబారిగా, శ్రీలంకకు భారత డిప్యూటీ హైకమిషనర్‌గా, ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్‌గా ఆయన విధులు నిర్వర్తించారు.