
328views
ఇజ్రాయెల్ దేశంపై మెరుపుదాడికి దిగిన హమాస్ మిలిటెంట్లను ఆ దేశం దీటుగా ఎదుర్కొంటోంది. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారత పౌరులకు అక్కడి భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించింది.
‘‘ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు సూచించిన భద్రతా ప్రొటోకాల్స్‌ను పాటించాలి. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. సురక్షిత శిబిరాలకు చేరువగా ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండి’’ అని టెల్ అవివ్‌లోని భారత దౌత్యకార్యాలయం తమ అడ్వైజరీలో పేర్కొంది.



