News

ఎమ్మెల్సీ గారు దేవుడిని నమ్మకపోతే పోయారు.. అమ్ముకుంటారా? – ఏపీ బీజేపీ ఫైర్‌

239views

వెంకటేశ్వరస్వామి దర్శనం విషయంలో ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ పై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు షాబ్జీపై కేసు నమోదు చేశారు. దర్శనం కోసం సిఫారసు చేసే ప్రజా ప్రతినిధుల వివరాలను టీటీడీ సేకరించింది. 16 మంది ప్రజా ప్రతినిధులు తరచుగా సిఫారసు లేఖలను ఇచ్చారని టీటీడీ గుర్తించింది. ఈ ప్రజా ప్రతినిధుల నుండి సమాచారం సేకరిస్తుంది. ఈ సందర్బంగా ఈ ఘటనపై బీజేపీ నాయకులు విష్ణు వర్దన్‌ రెడ్డి స్పందించార. ‘మీ సీనియర్ కమ్యూనిస్టు నేతలు “చేగువేరాలు” కావాలనుకుని దోపిడీదారులవుతున్నారు.. టీచర్లు అందరూ కలిసి ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీరు చేసే పని ఇదా షేక్ షాబ్జీ గారూ.. దేవుడ్ని నమ్మకపోతే అమ్ముకోవాలని చెప్పారా… భక్తుల్ని దోచుకోవాలని కమ్యూనిస్టు సిద్ధాంతాల్లో ఉందా? మీకు గురువుగా.. ఎమ్మెల్సీగా కొనసాగే అర్హత ఉందా ? నైతిక భాద్యత తీసుకోని ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు అని ఏపీ బీజేపి ప్రశ్నిస్తోంది’ అని ఆయన ట్విట్టర్‌ ట్వీట్‌ చేశారు.