
281views
జమ్మూకాశ్మీర్(Jammu and Kashmir)లో శుక్రవారం వంతెన ప్రమాదం జరిగింది. బైసాఖి ఉత్సవాల(Baisakhi Celebration) సందర్భంగా ఒక్కసారిగా వందలాది మంది వంతెన(Footbridge)పై చేరడంతో ప్రమాదం సంభవించింది. ఉద్ంపూర్ జిల్లాలోని బైన్ గ్రామం(Bain village)లోని బెనిసంగం(Beni Sangam) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూటీం సహాయక చర్యలు చేపట్టారని ఉదంపూర్ ఎస్ఎస్పీ వినోద్కుమారు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.




