News

గంగమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

320views

కడప జిల్లాలోని అనంతపురం గ్రామంలో మంగళవారం నుంచి జరగనున్న గంగమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచినీటి కుళాయిలు, మరుగుదొడ్లు, స్నానవాటికలు సిద్ధం చేశారు. తాగునీటికి కోసం ప్రత్యేక ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించు కునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు జాతర ప్రాంగణం అంతా చలువ పందిర్లు వేశారు. ఇప్పటికే జాతరలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటికే జాతర ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి పుట్టినిల్లు చాగలగుట్టపల్లె నుంచి మంగళవారం ఉదయం 7 గంటలకు అమ్మవారి జాతరకు చేరుకుంటుంది. ఆలయం ప్రాంగణం, విద్యుత్‌ అలంకారాలతో కలకలలాడుతోంది.