News

తిరుమల పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ

2views

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలోని పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ పనులు చేపట్టేందుకు పుణెకు చెందిన ‘లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్’ ముందుకు వచ్చింది.

ఈ కార్యక్రమంలో భాగంగా తొలిదశలో ఆలయానికి చెందిన ఉత్తర, పశ్చిమ, దక్షిణ వైపుల ఉన్న మండపాల పైకప్పులు (సీలింగ్), స్తంభాలకు సంబంధించిన రసాయన సంరక్షణ పనులు పూర్తయ్యాయి.

ఈ పనులు మైసూర్‌లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) మాజీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ కెమిస్ట్ అంబేడ్కర్ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పురాతన నిర్మాణాల ప్రాముఖ్యత, వాటి చారిత్రక స్వరూపం దెబ్బతినకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ఈ సంరక్షణ పనులు చేపడుతున్నారు.

పుణెకు చెందిన బి. వెంకటేశ్వర రావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేకంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.

తిరుమల ఆలయ ప్రాచీన నిర్మాణ సంపదను భవిష్యత్ తరాలకు పరిరక్షించడంలో ఈ శాస్త్రీయ రసాయన సంరక్షణ చర్యలు కీలకంగా నిలవనున్నాయి.