
కాన్పూర్ : వైవిధ్యమే భారత దేశానికి బలమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. మన మూలాల నుండి మనల్ని వేరుచేసే సమాజంలోని విస్మృతిని తొలగించడమే సంఘం యొక్క ప్రాథమిక కర్తవ్యం అని అన్నారు. మన భాషలు, సంప్రదాయాలు మరియు ఆరాధనా పద్ధతులు వేరుగా ఉండవచ్చు, కానీ మనమందరం ఒకే సాంస్కృతిక చైతన్యంలో భాగం అని ప్రకటించారు.
కాన్పూర్ లోని ఛత్రపతి షాహూజీ మహారాజ్ విశ్వ విద్యాలయంలోని వీరాంగణ రాణి లక్ష్మీబాయి ఆడిటోరియంలో
‘‘యువ సంవాద్’’ జరిగింది. దీనికి ముఖ్య వక్తగా సునీల్ అంబేకర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాఠక్ అధ్యక్షత వహించారు.
భారతీయ సంప్రదాయాలు వ్యక్తిగత స్వేచ్ఛకు ఎన్నడూ అడ్డు కావన్నారు. పైగా.. ఒక దానిటో ఒకటి పూరకాలు అని పేర్కొన్నారు. ద్వంద్వ ఆలోచనా పద్ధతికి యువత దూరంగా వుండాలని, ఐక్యత, కలిసి కట్టుగా వుండటం అనేవి హిందుత్వపు మూలిక సూత్రాలని, త్యాగం, అంకిత భావం, సేవ అనే విలువలే భారతీయులందర్నీ కలిపి వుంచుతాయని పేర్కొన్నారు.
ఆధునిక యుగంలో AI పాత్ర, ఉపాధి విషయంలో యువతలో వున్న ఆందోళనలను కూడా అంబేకర్ తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. AI యుగంలో, అది సమాచారాన్ని అందించగలదు మరియు దానిని వేగంగా విశ్లేషించగలదు. కానీ, ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలి మరియు ఏ నిర్ణయం అందరి ప్రయోజనాలకు, అలాగే సమాజ శ్రేయస్సుకు అనుకూలంగా ఉంటుందో నిర్ణయించే సామర్థ్యం మరియు విచక్షణ మాత్రం మానవులకే ఉంటాయని స్పష్టం చేశారు. యువత తమ విచక్షణకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని, తదనుగుణంగా వ్యవహారాలు చేయాలని సూచించారు. సాంకేతికత స్వరూపం ఎలా వుండాలి? మనం ఎలాంటి జీవితాన్ని గడపాలి అనేది సమాజమే నిర్ణయిస్తుందన్నారు. యువత తమ అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను వినియోగించుకోవాలంటే, ముందుకు తమను తాము అర్థం చేసుకోవాలని సూచించారు.





