ArticlesNews

‘‘సంఘ్’’ సాహిత్యంలో వందేమాతరం ప్రస్తావన

5views

– డా.లోకేంద్ర సిన్హా

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దృష్టిలో వందేమాతరం అనేది కేవలం ఒక గీతం మాత్రమే కాదు, అది దేశ ఆత్మ. దేశ నిర్మాణానికి మూలాధారమైంది. ఇది భాషా, ప్రాంతీయ సరిహద్దులకు అతీతమైన ఐక్యతా సందేశాన్ని ఇస్తుంది. అందుకే, దేశభక్తి అన్న స్ఫూర్తిని రగిలించేందుకు సంఘ స్వయంసేవకులు తమ రచనల్లో తరుచుగా ‘వందేమాతరం’ అన్న అంశాన్ని పొందుపరిచారు. దీనికి సంబంధించి అనేక వ్యాసాలు, పుస్తకాలు కూడా వచ్చాయి.

వందేమాతరం గీతాన్ని మతపరమైన కోణంలో చూడటానికి లేదా దానికి అగౌరవం కలిగించే ప్రయత్నాలు జరిగినప్పుడల్లా, సంఘ స్వయంసేవకులు వందేమాతరాన్ని సమర్థిస్తూ గళమెత్తారు.సంఘ సాహిత్యాన్ని పరిశీలిస్తే, అందులో వందేమాతరానికి ఉన్న స్థానం స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఆరెస్సెస్ మేధోమథన విభాగంలో కీలక వ్యక్తి, జ్యేష్ఠ ప్రచారక్, ప్రముఖ చింతనాపరులు రంగా హరిజీ ఈ అంశంపై వందేమాతరం ఆత్మకథ’’ అనే విశిష్టమైన పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం కేవలం జాతీయ గీతం చరిత్రను వివరించడమే కాదు, దానిని ఓ సజీవ శక్తిగా ఆవిష్కరించారు. అలాగే దేశ ఆవిర్భావం, పోరాట గాథను ఆ గీతం స్వయంగా వినిపిస్తున్నట్లే వుంటుంది. దేశ వ్యాప్తంగా వందేమాతరం అద్భుతమైన చరిత్రను విస్తృతం చేయాలన్న సంఘ్ ప్రయత్నానికి నిదర్శనంగా, ఈ పుస్తకం అనేక భాషల్లోకి కూడా అనువాదం అయ్యింది.

वंदेमातरम् की आत्मकथा’అన్న పుస్తకంలో రంగా హరి గారు ఈ గీతానికి సంబంధించిన రాజకీయ, మతపరమైన వివాదాల గురించి నిష్కర్షగా చర్చించారు. జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్ర బోస్ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు మరియు చర్చలను కూడా ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. ఇతర దేశాల జాతీయ గీతాలు తరచుగా స్వాతంత్ర్యం లేదా దేశ ఆవిర్భావం తర్వాత రూపొందించబడినప్పటికీ, “దేశ నిర్మాణం జరగకముందే ఒక విప్లవానికి నాంది పలికిన ఏకైక గీతం బహుశా ‘వందేమాతరం’ మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు.

వందేమాతరం అన్న పదాన్ని తీసపుకొని, సంఘ్ లో అనేక గీతాలు రూపొందాయి. ఈ గీతాలు స్వయంసేవకుల హృదయాలలో దేశభక్తి జ్వాలను సజీవంగా ఉంచుతాయి. నాకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమైన ఒక గీతం ఉంది. దేశభక్తి భావనను రేకెత్తించే ఈ గీతంలోని ప్రతి చరణం చివరన ‘వందేమాతరం’ అని వుంటుంది. राष्ट्र की जय चेतना का गान वंदे मातरम्, राष्ट्रभक्ति प्रेरणा का गान वंदे मातरम् ।। वंशी के बहते स्वरों का प्राण वंदे मातरम्, झल्लरी झनकार झनके नाद वंदे मातरम्, शंख के संघोष का संदेश वंदे मातरम् ।’’ అని వుంటుంది.

అలాగే సంస్కృతానికి సంబంధించి గీత్ కూడా ఒకటి వుంది. हे धरती माँ, महान माँ, मैं आपको नमन करता हूँ; आपके पवित्र चरणों की सदा जय हो… वन्दे मातरम्। దీని తర్వాత కూడా భారత దేశానికి సంబంధించిన ప్రార్థన వుంటుంది. ఎలాగైతే బంకిం చంద్ర వందేమాతరంలో చేశారో. ఆ గీతంలో ఏం చెప్పారంటే ఈ గీతం, హిమాలయాల నుండి ఉద్భవించి ఆ పర్వతాల స్వరూపంగా నిలిచిన ‘భారతమాత’వైన నీవు మాకు ఆత్మగౌరవాన్ని, సమృద్ధిని ప్రసాదిస్తావని చాటుతోంది. విశాలమైన సైన్యంతోనూ, అసంఖ్యాకమైన భుజబలంతోనూ నీవు నీ బిడ్డలను (దేశ పౌరులను) రక్షిస్తావు. అసంఖ్యాక కంఠాలు నీ కీర్తిని గానం చేస్తాయి. నీవు సాక్షాత్తూ లక్ష్మీ దేవి. నిర్మలమైన, అతుల్యమైన దానివి. బలాన్ని ప్రసాదించే దానివి. శత్రువులను నాశనం చేసేదానివి. అలాగే వారి అహంకారాన్ని అణచివేసే మాతవు.

వందేమాతరం నుంచి పూర్ణ విజయ వరకు దేశ ఆరాధన..

మరో గీత్ ని కూడా పరిశీలిస్తే.. ‘पूर्ण विजय संकल्प हमारा, अनथक अविरत साधना। निशिदिन प्रतिपल चलती आयो, राष्ट्रधर्म आराधना। वंदे मातृभूमि वंदे, वंदे जगजननी वंदे।।ఈ గీతంలో, మాతృభూమికి వందనం సమర్పిస్తూనే, సంపూర్ణ విజయం సాధించే వరకు తమ జాతీయ కర్తవ్యాన్ని ఆరాధిస్తూనే ఉంటామని స్వయంసేవకులు ప్రతిజ్ఞ చేస్తారు.ఈ పూర్ణ విజయ్ సంకల్పం ఏమిటి మరి? భారత మాతను పరమ వైభవ స్థితికి చేర్చడమే ఏకైక లక్ష్యం.
మరో గీత్ లో वन्दे जननी भारत धरणी शस्य श्यामला प्यारी। नमो नमो सब जग की जननी कोटि कोटि सुतवारी॥’ ఇందులో స్వయంసేవకులు వందేమాతరం తరహాలోనే భారత మాత గొప్పతనాన్ని చాటి చెప్పారు. మహోన్నతమైన హిమాలయాలు భారత మాతకు కిరీటంగా నిలుస్తున్నాయి. సింధు నది ఆమె పాదాలను కలుగుతోంది. పచ్చదనం ఆమె చీర కొంగులా విరాజిల్లుతోందని ఊహించారు.గంగ, యమున వంటి నదులు జీవనాధారమైన అమృతతుల్యమైన జలాలను అందిస్తాయి. అలాగే ఇక్కడే మధుర, అయోధ్య వంటి నగరాలున్నాయి. వీటిలో సాక్షాత్తూ ఆ దైవమే తన దివ్య లీలను ప్రదర్శించింది. భారత్ వందేమాతరం జై, భారత్ వందేమాతరం” అనే పాటలోని ప్రతి చరణం చివరన స్వయంసేవకులు “వందేమాతరం” అని ఉచ్చరిస్తారు. సంఘం వద్ద ఇటువంటి అనేక గీత్ లు వున్నాయి.

1949 నాటి వార్తాపత్రికలో ‘వందేమాతరం’

సంఘ్ స్వయంసేవకులు పత్రికలు నడపాల్సి వచ్చిన సమయంలోనూ వందేమాతరం ప్రతిష్ఠను పెంచే విధంగానే పని చేశారు.జలంధర్‌లో సంఘ్ స్వయంసేవకులు ‘ఆకాశవాణి’ అనే వార్తాపత్రికను ప్రచురించేవారు. 1949, డిసెంబర్ 11న ఆ వార్తాపత్రికలో స్వయంసేవకులు మేడమ్ భీకాజీ కామా బెర్లిన్‌లో ఎగురవేసిన భారతదేశపు మొదటి జాతీయ పతాకాన్ని ప్రచురించారు. వార్తాపత్రికలో ఆ జాతీయ జెండాతో పాటు జాతీయ గీతం ‘జన గణ మన’, జాతీయ గేయం ‘వందేమాతరం’ రెండింటి పూర్తి (అఖండ) రూపాలను కూడా ప్రచురించారు. ఇది జాతీయ ప్రతీకల పట్ల సంఘ్ స్వయంసేవకులకు ఉన్న భక్తిప్రపత్తులకు నిదర్శనం.

సంఘ శాఖలో ‘‘వందేమాతరం’’

సంఘ స్వయంసేవకులకు ‘‘వందేమాతరం’’ ప్రాముఖ్యత మొదటి నుంచీ వున్నదే. ఆరెస్సెస్ గురించి అవగాహన లేకుండా మాట్లాడేవారు ఎప్పుడైనా ఒకసారి సంఘ్ శాఖను సందర్శించి చూడండి, అక్కడ మ్రోగిపోయే వందేమాతరం జయజయధ్వానాలు మీకు వినిపిస్తాయి. స్వయంసేవకులు ఆటలు ఆడుకునే సమయంలో తమలో జోష్, ఉత్సాహం, ధైర్యాన్ని నింపుకోవడానికి చేసే జయఘోషలలో ‘వందేమాతరం’ ప్రధానమైనది.

మనం ఏ నగరానికి వెళ్లినా, వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించగలవారిలో అత్యధిక సంఖ్య సంఘ్ స్వయంసేవకులదే ఉంటుంది. ఎందుకంటే RSS కి చెందిన చాలా కార్యక్రమాల్లో వందేమాతరం సంపూర్ణ గానం చేస్తారు. ఇది కాకుండా, సంఘ్ ప్రేరణతో నడిచే సరస్వతీ శిశుమందిర్ పాఠశాలల్లో కూడా అఖండ వందేమాతరాన్ని నేర్పిస్తారు.

సర్ కార్యవాహ దత్తాజీ పిలుపు…

‘వందేమాతరం’ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనందిస్తూ, ఉత్సవాలను నిర్వహిస్తున్న ఈ సమయంలో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నుండి ప్రకటన రావడం వందేమాతరం, సంఘ్ మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని వెల్లడిస్తుంది. సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే తన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు- ‘మాతృభూమి ఆరాధన, సమగ్ర జాతీయ జీవితంలో చేతనాన్ని నింపే అద్భుత మంత్రం ‘వందేమాతరం’ రచన 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ జాతీయ గీత రచయిత పూజ్య బంకించంద్ర ఛటోపాధ్యాయను కృతజ్ఞతతో స్మరించుకుంటూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తోంది. 1875లో రచించిన ఈ గీతాన్ని 1896లో కాంగ్రెస్ జాతీయ సమావేశంలో పూజ్య రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరం కలిపి ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. అప్పటి నుండి ఈ గీతం దేశభక్తి మంత్రంగానే కాకుండా జాతీయ నినాదంగా, జాతీయ చేతనగా మరియు జాతీయ ఆత్మ ధ్వనిగా మారింది. ‘వందేమాతరం’ దేశ ఆత్మ గీతం, ఇది ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. నేడు ప్రాంతం, భాష, కులం వంటి సంకుచితత్వ ఆధారంగా విభజించే ప్రవృత్తి పెరుగుతున్న తరుణంలో, సమాజాన్ని ఐక్యతా సూత్రంతో ముడిపెట్టి ఉంచే సూత్రం ‘వందేమాతరం’. భారత్‌లోని అన్ని ప్రాంతాలు, సమాజాలు మరియు భాషలలో దీనికి సహజమైన ఆమోదం ఉంది. స్వయంసేవకులతో పాటు సమగ్ర సమాజం వందేమాతరం స్ఫూర్తిని ప్రతి హృదయంలో రగిలిస్తూ ‘స్వ’ (స్వీయ) ఆధారంగా రాష్ట్ర నిర్మాణ కార్యం కోసం క్రియాశీలకం కావాలని, మరియు ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పిలుపునిస్తోంది.’