News

ఆలయంలో విగ్రహం అపహరణకు యత్నం

248views

అల్లూరి సీతారామరాజు జిల్లా మునగపాక పాటిపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆకతాయిలెవరో అపహరించేందుకు యత్నించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల పనిగా స్థానికులు భావిస్తున్నారు. ఎప్పటిలాగానే ఉదయం ఆలయం పైకి వెళ్లిన స్థానికులకు అభయాంజనేయ స్వామి విగ్రహం స్థానచలనం అయినట్టు గుర్తించారు. ఎవరో ఆకతాయిలు విగ్రహాన్ని ఎత్తుకుపోయేందుకు యత్నించినట్టు గుర్తించారు. దీంతో స్థానికులు కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.