
253views
బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య జరిగింది. అరటిపళ్ల విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఓ కుటుంబంలోని ముగ్గురు ఈ దారుణానికి ఒడిగట్టారు. లిటన్ చంద్ర ఘోష్(55) అనే వ్యాపారికి గాజిపుర్ జిల్లాలోని కలిగంజ్ ప్రాంతంలో బైశాఖి స్వీట్‌మీట్ అనే హోటల్ ఉంది. అదే ప్రాంతానికి చెందిన మాసుమ్ మియా(28) అనే వ్యక్తికి చెందిన అరటి తోటలోని కొన్ని గెలలు అదృశ్యమయ్యాయి. వీటిని మాసుమ్, అతడి తండ్రి స్వపన్ మియా(55), తల్లి మజేదా ఖాతున్(45)లు లిటన్ హోటల్‌లో గుర్తించారు. ఈ విషయమై వీరి మధ్య జరిగిన గొడవలో లిటన్‌ను నిందితులు తీవ్రంగా కొట్టి, కిందకు నెట్టేశారు. దీంతో లిటన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్యతో సంబంధమున్న ముగ్గురిని పోలీసులు అరెస్టుచేశారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులపై జరుగుతున్న వరుస దాడులతో ఈ హత్యకు సంబంధముందా? లేదా? అన్నది తెలియరాలేదు.





