News

అర్ధ కుంభమేళాలో హైందవేతరులకు ‘‘నో ఎంట్రీ’’.. వెల్లువలా డిమాండ్లు

255views

ఉత్తరాఖండ్ హరిద్వార్ కేంద్రంగా 2027 లో జరగబోయే అర్ధ కుంభమేళా విషయలో అత్యంత కీలకమైన డిమాండ్ తెరపైకి వచ్చింది. కుంభమేళాకి హైందవేతరులు రాకుండా నిషేధించాలని, దీనిని హైందేవతరులకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ‘‘గంగా సభ కమిటీ’’ తో పాటు అనేక మంది అర్చకులు, యాత్రికులు ఈ డిమాండ్ ను ముక్తకంఠంతో తెరపైకి తెచ్చారు. ఇప్పటికే హైందవేతరులకు ప్రవేశం నిషేధించబడింది’’ అంటూ ఆ ప్రాంతంలో ఇప్పటికే బోర్డులు వెలిశాయి.

హరిద్వార్‌లోని 120 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దాదాపు 105 ఘాట్‌లలో ఈ నిషేధాన్ని అమలు చేయాలని పరిపాలన ఆలోచిస్తున్నట్లు సమాచారం. గంగా సభ కమిటీ చేసిన ఈ డిమాండ్ ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా స్పందించారు. ‘‘హరిద్వార్ ఒక పవిత్ర నగరం, మరియు దాని ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని ప్రకటించారు.

ఇంతోనే ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షమ్స్ కూడా స్పందించారు. ఉత్తరాఖండ్ అనేది సనాతన ధర్మ రాజధాని అని, దేవతల భూమిలో అర్ధకుంభమేళా ప్రధాన కార్యక్రమం అని అన్నారు. దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సామాజిక వ్యతిరేక శక్తులు అనేక కుట్రలు పన్నుతున్నాయని, ఇలాంటి పెద్ద కార్యక్రమాలలో ఏదైనా పెద్ద సంఘటన జరగడానికి దీని ద్వారా అవకాశం ఉందని షమ్స్ అన్నారు.అలాంటి సందర్భంలో హిందూయేతరుడు కుంభ్ ప్రాంతానికి వెళితే, మత విశ్వాసాల కారణంగా అల్లర్లు లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల గంగ, కుంభ్ నదిపై విశ్వాసం లేని వారిపై నిషేధం విధించడం సముచితమని ఆయన అన్నారు.