News

బలవంతపు మతమార్పిడి చేస్తున్న పాస్టర్‌తో సహా 11 మంది అరెస్ట్

223views

బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్న క్రైస్తవ పాస్టర్, అతని భార్యతో సహా మరో 12 మందిని నాగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్టర్ సుధీర్ చర్చి ఆఫ్ సౌత్ ఇండియా కేరళ డయోసెస్ నాగపూర్ మిషప్ తో సంబంధాలు నెరుపుతున్నాడు. అంతేకాకుండా అతని భార్య జాస్మిన్ ను కూడా అరెస్ట్ చేశారు.పాస్టర్ సుధీర్ తో సహా అతని ముఠా అక్రమ మత మార్పిళ్లు చేస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఫలితంగానే పోలీసులు రంగంలోకి దిగి, అరెస్ట్ చేశారు.

పోలీసు నివేదిక ప్రకారం ప్రార్థనా సమావేశాలు కొనసాగుతున్న సమయంలో, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్టర్ సుధీర్, అతని భార్య తో సహా అతని ముఠాలోని 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే విచారణను కూడా ప్రారంభించారు.

వీరందర్నీ కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు ప్రకటించారు. కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని అమరవిలాకు చెందిన ఫాదర్ సుధీర్ గత ఐదు సంవత్సరాలుగా మహారాష్ట్రలో పనిచేస్తున్నారు. అరెస్టయిన 14 మందిలో పది మంది మహారాష్ట్ర వాసులు.