News

అది వక్ఫ్ ఆస్తి కాదు..తీర్పు చెప్పిన మద్రాస్ కోర్టు

283views

తిరునెల్వేలి జిల్లాలో 1,100 ఎకరాల భూమిని వక్ఫ్ ఆస్తిగా మసీదు చేసిన వాదనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. 1712లో అప్పటి మధురై సమస్థానం పాలకుడు మసీదుకు విరాళంగా ఇచ్చాడని కోర్టు స్పష్టంగా పేర్కంది. దీనికి సంబంధించిన ఆధారాలు రాగి ఫలకంపై ఉన్నాయి, కానీ మిగిలిన భూమి మసీదుకు చెందినది కాదు అని కోర్టు చెప్పింది.

2016 ఆగస్టు 18న కండియపెరిలోని కన్మియా పల్లివాసల్ (మసీదు) ముత్తవల్లికి అనుకూలంగా వక్ఫ్ ట్రిబ్యునల్ (తిరునెవేలి ప్రిన్సిపల్ సబ్ కోర్ట్) జారీ చేసిన తీర్పును సవాలు చేస్తూ, తమిళనాడు ప్రభుత్వం 2018లో దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను పాక్షికంగా అనుమతిస్తూ జస్టిస్ ఎం. దండపాణి తీర్పు చెప్పారు.

ఈ కేసులో, ఈ విస్తారమైన ప్రాంతం వక్ఫ్ ఆస్తి అని, మతపరమైన , సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలని మసీదు వాదించింది. మొత్తం 1,100 ఎకరాల విస్తీర్ణంపై తమకు మతపరమైన హక్కులు ఉన్నాయని మసీదు వాదించింది. దీనికి విరుద్ధంగా కోర్టులో సవాలు చేశారు. ఈ వాదన నిరాధారమైనదని మాత్రమే కాకుండా వ్యవసాయ జీవనోపాధికి, భూమి యాజమాన్యానికి. రాష్ట్ర వనరులకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని వాదించింది. రాష్ట్రం తరపున వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ వీర కతిరవన్, మసీదు జాబితా చేసిన భూములను తమిళనాడు ఇనామ్ రద్దు చట్టం, 1963 ప్రకారం ఇప్పటికే రైతువారీగా ప్రకటించారని ఎత్తి చూపారు. ఈ భూములను 1966లో భూమిలేని రైతులకు పునఃపంపిణీ చేశారు, ప్రస్తుతం 362 కుటుంబాలు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాల ఆధారంగా వాటిని సాగు చేసుకుంటున్నాయి అని వాదించారు. సమగ్ర విచారణ తర్వాత, మద్రాస్ హైకోర్టు “ఒకసారి ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించిన తర్వాత, అది అలాగే ఉంటుంది. కానీ ఆ వక్ఫ్ పరిధిని మొదట మంజూరు చేసిన దానికంటే కృత్రిమంగా పెంచలేము” అని చరిత్ర పత్రాల ఆధారంగా తన నిర్ణయాన్ని వెలువరించింది. వక్ఫ్ బోర్డులకు అదుపులేని అధికారాలు, పారదర్శక భూ తనిఖీలు లేకపోవడం వల్ల ఇటువంటి ప్రయత్నాలు పెరిగాయని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ సందర్భంలో, హైకోర్టు తీర్పు వందలాది రైతు కుటుంబాలను కాపాడడమే కాకుండా, కీలకమైన రాష్ట్ర వనరులను ఇతరులకు అప్పగించకుండా కాపాడింది.