News

‘రామాయణం’పై జాతీయ స్థాయి న్యాయ సదస్సు

226views

‘వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రం’లో శనివారం రామాయణంపై తొలి జాతీయ స్థాయి న్యాయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త నారాయణ గౌరీనిత్య తెలిపారు. శుక్రవారం పరిశోధన కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రామాయణంలో ఉండే న్యాయం, ధర్మం, సమానత్వం, పరిపాలన సూత్రాలు నేటి రాజ్యాంగ విలువలతో అనుసంధానం చేసేలా ఉండాలని తెలిపారు. న్యాయపాలనపై నిపుణులు చర్చిస్తారని వివరించారు. స్త్రీ హక్కులు, సీతమ్మ అగ్ని ప్రవేశం, రామయ్య ధర్మ పాలనపై నిపుణులు ప్రసంగిస్తారన్నారు. తవాస్మి అకాడమీ వ్యవస్థాపకుడు శ్రీరామ్‌ చక్రధర్‌, ఆచార్య లజపతిరాయ్‌, ధర్మకర్త నారాయణ శ్రీనివాసులు జాతీయస్థాయి సదస్సును పర్యవేక్షిస్తున్నారని ఆమె వివరించారు.