News

శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఏర్పాట్లు

239views

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని , పండగ శోభ ప్రతిబింబించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. ప్రతి దశ లోనూ అధికారుల మధ్య సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అమ్మవారి పండగ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని శాఖలు వారికీ కేటాయించిన విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని, సిరిమాను పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. వి.ఐ.పి దర్శనాల వల్ల సాధారణ భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సిరిమాను తిరిగే ప్రదేశం లో ఎక్కడా రోడ్డు పై గుంతలు లేకుండా చూడాలని.. పారిశుధ్యం, రక్షిత తాగు నీటి సరఫరా, బయో టాయిలెట్స్ ఏర్పాటు, నగరమంతా సుందరీకరణ, విద్యుత్ అలంకరణ తదితర పనులను మున్సిపల్ శాఖ నిర్వహించాలని సూచించారు.