
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ గో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షుడు కృష్ణ చరణానందా భారతి స్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హిందూ ధర్మ సభ నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవధ నిషేధ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించే మార్పులు తీసుకురావాలని పేర్కొన్నారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి బారతీయుడు కృషి చేయాలని అన్నారు. గిరిజనులకు మౌలిక వసతులు కల్పించి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సత్యానందగిరి స్వామి పాల్గొన్నారు.
అనంతరం పాయకరావుపేటలో హిందూ ధర్మ మహాసభ ఆధ్వర్యంలో హైందవ ధర్మ పరిరక్షణకు ధర్మచైతన్య పాదయాత్రను నిర్వహించారు. పాదయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నందస్వామి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో విలువైనవని వివరించారు. భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.
సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి బారతీయుడు కృషి చేయాలని భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షుడు కృష్ణ చరణ్ నందస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హిందూ ధర్మ మహాసభ ఆధ్వర్యంలో హైందవ ధర్మ పరిరక్షణకు ధర్మచైతన్య పాదయాత్రను నిర్వహించారు. పాదయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నందస్వామి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో విలువైనవని వివరించారు. భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.





