News

ముస్లింల దాష్టీకంతో చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో హిందూ ప్రొఫెసర్ పదోన్నతి నిలిపివేత

341views

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కుశాల్ బరన్ చక్రవర్తి పదోన్నతిని నిలిపివేశారు. ఉద్యోగాన్ని వదిలివేయమని కూడా ఆయనపై ఒత్తిడి వచ్చింది.

జూలై 4న, డాక్టర్ కుశాల్ బరన్ చక్రవర్తిని పదోన్నతి కోసం ఇంటర్వ్యూకి పిలిచారు. అదే సమయంలో, మత ఛాందసవాద ముస్లిం విద్యార్థి సంస్థ ‘ఇస్లామీ ఛత్ర శిబిర్’కు చెందిన విద్యార్థులు వైస్ ఛాన్సలర్ కార్యాలయం వెలుపల గుమిగూడి గందరగోళం చేయడం ప్రారంభించారు. ఈ కారణంగా, అంటని పదోన్నతి ప్రక్రియ నిలిపివేయడంతో పాటు పదోన్నతి రద్దు చేసారు.

ముస్లిం విద్యార్థులు అతని పదోన్నతిని ఆపాలని డిమాండ్ చేయడమే కాకుండా, విశ్వవిద్యాలయం నుండి అతనిని బహిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ భవనాన్ని చుట్టుముట్టి తాళం వేశారు.

‘ఇస్లామీ ఛత్ర శిబిర్’ సంస్థ అధిపతి హబీబుల్లా ఖలీద్, వైస్ ఛాన్సలర్ కార్యాలయంలోకి ప్రవేశించి అందరి ముందు డాక్టర్ చక్రవర్తితో అసభ్యంగా ప్రవర్తించాడు. డాక్టర్ చక్రవర్తిని 3 గంటల పాటు కార్యాలయంలో ఉంచి మానసికంగా హింసించారు.

డాక్టర్ చక్రవర్తి ‘సనాతని జాగరణ్ జోత్’ మరియు ‘సనాతన్ విద్యార్థి సంసద్’ సంస్థలతో సంబంధం కలిగి ఉండటంతో పాటు బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. అందుకే ఆయనను అవమానించడంతో పాటు హత్య కేసులో ఆయన ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేశారు.

యాక్టింగ్ రిజిస్ట్రార్ మొహమ్మద్ సైఫుల్లా ఇస్లాం విద్యార్థుల ప్రవర్తనను సమర్ధించడమే కాక దీనిని ‘గత చర్యల ఫలితం’ అని చెప్పడం శోచనీయం.

హిందువుల నిరసన
జూలై 4న, ‘సనాతని జాగరణ్ జోత్’తో సంబంధం ఉన్న హిందూ విద్యార్థులు ఢాకా విశ్వవిద్యాలయంలో తీవ్ర నిరసన తెలిపారు. డాక్టర్ చక్రవర్తికి భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాగా షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవి నుండి వైదోలగడంతో ఆ దేశంలో చాలా మంది హిందూ ప్రొఫెసర్లతో బలవంతపు రాజీనామాలు ముస్లిం చాందసవాదులు చేయించారు.