
273views
జమూకశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించిన ఆరుగురిని అరెస్టు చేశామని, ఇందులో ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఉన్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. ఈ ఆరుగురిలో నలుగురిని శుక్రవారం, ఇద్దరిని గురువారం నిర్బంధించామని ఆయన అన్నారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యానించిన వారి కోసం అసోం పోలీసులు ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, రానున్న రోజుల్లో ఇంకొన్ని అరెస్టులు జరుగుతాయని ఆయన తెలిపారు. పహల్గాంలో జరిగిన హేయమైన దాడికి సంబంధించి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పాకిస్థాన్‌ను సమర్థించిన వారిని సహించేది లేదని ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.




