News

పాక్‌లో హమాస్ అగ్ర నేతలు తిష్ట.. అక్టోబర్ 7 నాటి ప్లానే అమలు!

247views

హమాస్ అగ్ర నేతలు పాకిస్థాన్‌లో తిష్ట వేసినట్లుగా తెలుస్తోంది. లష్కరే తోయిబాతో కలిసి హమాస్ కలిసి పని చేస్తున్నట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ కూడా ధృవీకరించారు.

ఇటీవల కాలంలో హమాస్ నాయకులు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ప్రాంతాన్ని సందర్శించినట్లుగా రూవెన్ పేర్కొన్నారు. అక్కడ జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశం అయినట్లుగా తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిపినట్లుగానే.. పహల్గామ్‌పై కూడా అదే మాదిరిగా ఉగ్రదాడి జరిగిందని.. రెండింటికీ పెద్ద తేడా లేదని రూవెన్ అజార్ పేర్కొన్నారు. ఒక ప్రణాళిక ప్రకారమే పహల్గామ్ ఉగ్రదాడి జరిగినట్లుగా వెల్లడించారు. అక్టోబర్ 7, 2023న కూడా హమాస్ పౌరులనే లక్ష్యంగా చేసుకున్నారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులనే టార్గెట్ చేసుకున్నారని.. ఇదంతా హమాస్ సాహకారంతోనే పహల్గామ్ ఘటన జరిగినట్లు వివరించారు. అప్పుడు ఇజ్రాయెల్‌ పౌరులు సంగీత కార్యక్రమంలో ఉండగా దాడి చేశారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులు సరదాగా గడుపుతున్న సమయంలో ఎటాక్ చేశారని గుర్తుచేశారు. హమాస్-లష్కరే తోయిబా సమన్వయంతోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని స్పష్టం చేశారు.