News

భగీరథుడి విగ్రహావిష్కరణ

499views

అనంతపురం జిల్లా పరిగి మండలంలోని జంగాలపల్లి గ్రామంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథ భగీరథ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 2018 నుంచి 2019 వరకు గ్రామంలో భగీరథ విగ్రహావిష్కరణ వాయిదా పడుతూ ఇప్పటికి ఏర్పాటుకావడం సంతోషకరంగా ఉందన్నారు.భగీరథ మహర్షి పట్టుదలకు మారుపేరు అన్నారు. ఆలయ నిర్మాణం కోసం ప్రజల నుంచి వినతులు వచ్చాయని వాటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు. అనంతరం గ్రామంలోని మహిళలు గ్రామం నుంచి కాటమప్ప ఆలయం వరకు జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, సర్పంచ బాలాజీ, వడ్డే హనుమయ్య, శేఖర్‌, ఆశ్వత్థప్ప, శ్రీనివాసరెడ్డి, నరసింహులు, కుమార్‌, చౌడప్ప పాల్గొన్నారు.