News

‘దత్తాజీ దిదోల్కర్ సంస్థాగత నైపుణ్యం అద్భుతం’: డాక్టర్. మోహన్ భాగవత్ జీ

230views

కాలం మారుతున్నప్పటికీ ఆలోచనల్లో స్థిరత్వం గోచరించినప్పుడే సమాజం మనకు బాసటగా నిలుస్తుందని పరమ పూజనీయ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్. మోహన్ భాగవత్ గారు స్పష్టం చేశారు. విలువలు అనేవి వాటంతట అవే చొప్పించబడవని, ప్రజాదరణ లేదా వనరులు సైతం ఇందుకు దోహదం చేయవన్నారు. విలువలు అనేవి కేవలం కఠోర శ్రమ ద్వారానే ఇముడుతాయని స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌లోని కవివర్య సురేష్ భట్ ఆడిటోరియంలో నిర్వహించిన దత్తాజీ దిదోల్కర్ జయంతి వార్షికోత్సవ ముగింపు కార్యక్రమంలో సర్ సంఘ్‌చాలక్ జీ పాల్గొని ప్రసంగించారు. అన్ని వేళలా కార్యకర్తల దిశ సరిగ్గా ఉండాలన్న ఆయన సమాజ పరిస్థితులు మారినప్పటికీ కార్యకర్తల పని దిశ మారకూడదని తెలిపారు. విద్యార్థుల జీవితాలపై దత్తాజీ ప్రభావం చాలా ఉందన్నారు. ఆయన ప్రసంగం కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చేంద శక్తిని కలిగి ఉందన్నారు.

ప్రతికూల పరిస్థితుల్లో సైతం సంఘ్‌కు కార్యకర్తలను సృష్టించిన దత్తాజీ దిదోల్కర్ సంస్థాగత నైపుణ్యం అద్భుతమని మోహన్ జీ కొనియాడారు. స్వచ్ఛమైన నడవడిక కారణంగానే అందరూ ఆయన్ను గౌరవిస్తారని చెప్పుకొచ్చారు. సంఘ్ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కార్యకర్తలుగా మనం ఏయే లక్షణాలు పొందాలి, మన సంకల్పం ఏంటి, కొత్తగా చేరిన కార్యకర్తల అభివృద్ధికి మన ఆలోచనలు ఏమిటి అనే విషయాలను సమగ్రంగా పరిగణించాలని ఈ సంద్భంగా మోహన్ భాగవత్ గారు ఉద్భోదించారు. దత్తాజీ జీవితం, రచనలను అధ్యయనం చేయడంతో పాటు ప్రజలతో అనుసంధానం అయ్యే ఆయన కళను అలవరచుకోవాలని అదే దత్తాజీకి నిజమైన నివాళి అన్నారు. తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో దత్తాజీ కృషి ఎంతో ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఈ సందర్భంగా దత్తాజీ జీవితం ఆధారంగా రూపొందించిన ‘ఆధర్వద్‌’ అనే బుక్‌లెట్‌, సావనీర్‌ను విడుదల చేశారు.