News

మదనపల్లెలో..ఆదినాథ్‌ శ్రీగురు మహావతార్‌ ఆలయం

391views

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సత్సంగ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నక్కలదిన్నె వద్ద నిర్మించిన ఆదినాథ్‌ శ్రీగురు మహావతార్‌ బాబాజీ ఆలయాన్ని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం ప్రారంభించారు. తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మదనపల్లె వచ్చిన ఆయనకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, నాయకులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 5.30కు మంత్రి ఆలయాన్ని ప్రారంభించారు. సత్సంగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ముంతాజ్‌ అలీ మంత్రిని ఆలయం వద్దకు మర్యాదపూర్వకంగా తీసుకొచ్చారు. రాత్రి వరకు గడ్కరీ అక్కడే గడిపారు. అనంతరం ఆలయం లోపల జరిగిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమానికి కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో సత్సంగ్‌ ఫౌండేషన్‌ సభ్యులు హాజరయ్యారు.