News

చెక్కపై రామాయణ వృత్తాంతం

245views

ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ప్రముఖ శిల్పకారుడు మందుగుల కనకలింగ వీరబ్రహ్మం 30 రోజుల పాటు కష్టపడి చెక్కపై ‘శ్రీమద్ రామాయణ వృత్తాంతం’ అందంగా తీర్చిదిద్దారు. ఈయన అనేక రకాల శిల్ప కళాఖండాలను గీస్తూ పట్టణంలో ఖ్యాతిగాంచారు. ఈ రామాయణ వృత్తాంతాన్ని పలువురు పట్టణ వాసులు చూసి ఈయనను ప్రశంసించారు. ఇటీవల ఈయనకు విశ్వకర్మ సంఘం వారు హైదరాబాద్లో లెజండరీ అవార్డు కూడా అందజేశారు.