
327views
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జులై నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్‌లో టికెట్లు కేటాయిస్తారు. వీటిని పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది.