News

సత్యదేవుని రథానికి వెండి తాపడం

354views

అన్నవరం సత్యనారాయణ స్వామికి నూతనంగా తయారు చేయించిన రథానికి దాతల సహకారంతో లేదా దేవస్థానం వద్ద అందుబాటులో ఉన్న వెండితో తాపడం చేయించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం సూచించింది. 14.5 అడుగుల ఎత్తు, 6.5 అడుగుల వెడల్పు, లోతుతో నూతనంగా రథం తయారు చేయించి, ఇటీవలే ఈ రథసేవను ప్రారంభించిన విషయం విదితమే. సుమారు 350-400 కేజీల వెండి అవసరం అవుతుందని అంచనా. వెండి దేవస్థానం అందిస్తే గుత్తేదారు పనులు చేపడతారు. దేవస్థానం వద్ద ఉన్న వెండి సరిపడదని భావిస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకొస్తే అవకాశమివ్వాలని యోచిస్తున్నారు. దేవస్థానంలో అందుబాటులో ఉన్న వెండిని వినియోగిస్తే పూర్తి స్థాయిలో అనుమతులు, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, అదే దాతల సహకారంతో పనులు చేపడితే ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు.