News

లక్షద్వీప్‌లో ఐఎన్‌ఎస్‌ జటాయు నౌకాస్థావరం ప్రారంభం

309views

లక్షద్వీప్‌లో మినికోయ్‌ వద్ద భారత నౌకాదళం ‘ఐఎన్‌ఎస్‌ జటాయు’ పేరుతో నౌకాస్థావరాన్ని ప్రారంభించింది. లక్షద్వీప్‌లో ఎంతోకాలం నుంచి నౌకాదళ పర్యవేక్షణ ఉందని, ఐఎన్‌ఎస్‌ జటాయు చేరికతో భద్రత మరింత పెరుగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమ అరేబియా సముద్రంలో మాదకద్రవ్యాల రవాణాను, సముద్ర దొంగల కార్యకలాపాలను అడ్డుకునే చర్యలకు ఈ స్థావరం దోహదకారిగా ఉంటుందన్నాయి. రామాయణంలో సీతాదేవి అపహరణను అడ్డుకునేందుకు మొదటగా ప్రయత్నించి, ప్రాణాన్ని పణంగా పెట్టిన జటాయు పక్షికి చిహ్నంగా ఆ పేరునే దీనిని ఖరారు చేశామని అడ్మిరల్‌ హరికుమార్‌ చెప్పారు.