News

త్రివర్ణ శోభితంగా బుర్జ్ ఖలీఫా

291views

మోదీకి స్వాగతం పలుకుతూ దుబాయ్ లోని ప్రపంచ అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీ ఫాపై భారత త్రివర్ణ పతాకాన్ని, ‘గౌరవ అతిథి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అనే సందేశాన్ని ప్రదర్శించారు. సదస్సులో పాల్గొనేముందు యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తామ్తోతో మోదీ దుబాయ్ లో సమావేశమై విస్తృత చర్చలు జరిపారు. భారత్ ను సందర్శించవలసిందిగా ఆయనను ఆహ్వానించారు. ‘వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్’ సందర్భంగా మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజొలినా తోనూ మోదీ సమావేమయ్యారు. మడగాస్కర్ తో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ నిబద్ధతతో ఉందని, ద్వీప దేశ అభివృద్ధికి సహకారం అందిస్తా మని ప్రధాని పునరుద్ఘాటిం చారు. కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి ఈ పర్యటనలో భారత్, యూఏఈ పది ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు భారత విదేశీ వ్యవహారాల కార్య దర్శి వినయ్ క్వాత్రా మీడియాకు తెలిపారు.