News

అయోధ్యకి ప్రాణ ప్రతిష్ట యంత్రాన్ని అందించిన చిదంబర శాస్త్రికి సన్మానం

374views

హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామమందర నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాణ ప్రతిష్ట సమర్పించిన డా.అన్నదాన చిదంబర శాస్త్రి మన తెలుగు వారు కావడం అందులోను చీరాల ప్రాంతానికి చెందిన వారు కావడం మనందరి అదృష్టమని గాయత్రీ పరివార్ చీరాల శాఖ ప్రతినిధులన్నారు.

బాపట్ల జిల్లా చీరాలలో గాయత్రీ పరివార్ చీరాల శాఖ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరానికి ప్రాణ ప్రతిష్టకు యంత్రాన్ని సమర్పించిన డా.అన్నదాన చిదంబర శాస్త్రి దంపతులకు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిదంబర శాస్త్రి దంపతులకు గాయత్రీ పరివార్ ప్రతినిధులు మేళతాళాలతో, పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికిన అనంతరం దుశ్చలవాలతో, గజ మాలలతో ఘనంగా సత్కరించారు.