
హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. పలు ఆలయాల్లో దుండగలు చొరబడి, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.ఈ కోవలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. నోయిడా సమీపంలోని రీచ్‌పాల్ గఢీ గ్రామంలోని ఆలయంలో చొరబడి దుండగులు విగ్రహాలను ధ్వంసం చేసి పరారయ్యారు. అదనంగా, మందిరంలోని దేవతల వస్త్రాలకు నిప్పంటించారని తెలుస్తోంది.
సెంట్రల్ నోయిడా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హ్రిదేష్ కఠారియా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలోని ఆలయంలో విగ్రహాల ధ్వంసం గురించి పోలీసులకు సమాచారం అందిందన్నారు.ప్రాథమిక విచారణలో ఆలయం సమీపంలో పోలీసులు ఖాళీ మద్యం బాటిళ్లను కనుగొన్నారని తెలిపారు.ధ్వంసం చేసే సమయంలో విధ్వంసకులు మద్యం మత్తులో ఉండవచ్చని అనుమానిస్తునట్లు కఠారియా పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఇప్పటికే బిస్రఖ్ పోలీస్ స్టేషన్‌లో గుర్తుతెలియని అనుమానితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. నేరస్థులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని, సీసీటీవీ ఫుటేజీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు.
Source : OpIndia




