News

అప్పన్న ఆలయంలో నేటి నుంచి తిరునక్షత్రం పూజలు

347views

శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో నేటి నుంచి 16వ తేదీ వరకు మణవాళ మహామునుల తిరునక్షత్రం పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అయిదు రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవలను ఆలయాధికారులు రద్దు చేశారు. సహస్రనామార్చన, స్వర్ణ పుష్పార్చన, స్వర్ణ తులసీదళార్చన, గరుడ వాహన సేవ, నిత్య కల్యాణోత్సవాలను రద్దు చేసినట్లు వివరించారు. స్వామివారి ఆవిర్భావ తార స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆలయంలో సుదర్శన హోమం వైభోవపేతంగా నిర్వహించారు.

ఇప్పటివరకు ప్రత్యక్ష విధానంలోనే నిర్వహిస్తున్న ఈ హోమాన్ని ఆదివారం నుంచి పరోక్ష విధానంలో కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసిన భక్తులకు యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.

6 గంటల వరకే దర్శనాలు:
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనాలు లభిస్తాయని ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. 6 గంటల తర్వాత సింహగిరిపై నరక చతుర్ధశి, దీపావళి అమావాస్య వేడుకలు జరుగుతాయన్నారు. సింహగిరి మాడవీధుల్లో స్వామివారి తిరువీధి, నరకాసుర వధ నిర్వహిస్తారు.