
436views
విజయనగరం జిల్లాలో ఆదివారం నాడు జరిగిన రైలు ప్రమాదంలో గాయపడ్డవారికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు సహాయ సహకారాలు అందించారు.విజయనగరంలోని కంటకాపల్లి, అలమండ మధ్య భీమాలి వద్ద జరిగిన రైలు ప్రమాద విషయం తెలిసిన వెంటనే గొల్లపేట శాఖ స్వయంసేవకులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు.రైలు బోగీల్లో క్షతగాత్రులను బయటకు తీయడం, వారిని అంబులెన్స్ వరకు పట్టుకెళ్లడం, మృతదేహాలను బయటకు తీయడం వంటి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.ప్రమాదంలో గాయపడ్డవారిని వారిని ఆసుపత్రికి చేర్పించడం లాంటి పనులలో స్థానిక పోలీసు వారికి, జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) వారికి సహకారాన్ని అందించారు.





