News

కనుల పండువగా ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి రథోత్సవం

351views

తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది. విద్యుద్దీపాల వెలుగులు, భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రాల నడుమ క్షేత్ర పురవీధుల్లో సాగింది. తొలుత స్వామి, అమ్మవార్లను తొళక్కం వాహనంపై ఆలయం నుంచి మెట్ల మార్గం ద్వారా రథం వద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ఛైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు, ఈవో వేండ్ర త్రినాథరావులు రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. తీన్మార్‌, డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, కోలాటం, భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కల్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారు రుక్మిణి, సత్యభామ సమేత మురళీకృష్ణ అలంకారంలో దర్శనమిచ్చారు.