
విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బంగారుమెట్ట గౌరీపరమేశ్వరుల అనుపోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజాము నుంచి ఆదిదంపతులకు విశేషపూజలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. మేళతాళాలు, డుప్పు వాయిద్యాలతో గౌరీపరమేశ్వరులను పురవీధుల్లో ఊరేగించారు. వివిధ వేషధారణలతోపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సాముగరిడీ, చిటికెలు, చిడతలు, పూజల డాన్సు, బిందెల డాన్సు ప్రదర్శించారు. కబడ్డీ పోటీల్లో మొదటి మూడుస్థానాలో నిలిచిన జట్లకు నగదు పురస్కాలను అం దజేశారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి వేలాది మందిగా తరలి రావడంతో బంగారుమెట్ట, ఎల్‌బీపీ అగ్రహారం గ్రామాల్లో ఎటుచూసినా జనసందోహమే కనిపించింది. విప్ కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, కేఎస్‌ఎన్‌ఎస్.రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, టీడీపీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, జడ్పీటీసీ దొండా రాంబాబు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్, డైరెక్టర్ గేదెల సత్యనారాయణ తదితరులు గౌరీపరమేశ్వరులను దర్శించుకున్నారు.


