
277views
ఆలయాల దూప, దీప నైవేధ్యాల కోసం దానం ఇచ్చిన భూములను కొందరు గుప్పిట పెట్టుకుని దేవదాయశాఖ ఆదాయానికి గండి కొడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా రంపయర్రంపాలెంలోని రైతులు ఆరోపిస్తున్నారు. బహిరంగ వేలం ద్వారా మల్లంపల్లి సుందరమ్మ సత్రం భూములకు.. భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఎన్నో ఏళ్లుగా వేలం నిర్వహించకుండా కొందరు పెద్దలు అడ్డుకుంటున్నారని.. ఆ భూములు తమ సొంత ఆస్తి అన్నట్లుగా వారసులకూ… రాసిచ్చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.





