News

వీఐపీల సేవలో అధికారులు.. సామాన్య భక్తులకు దక్కని దర్శన భాగ్యం

225views

అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం తిలకించే భాగ్యం సామాన్య భక్తులకు దక్కలేదు. నిబంధనలకు విరుద్ధంగా లెక్కకు మించి ప్రొటోకాల్‌, వీఐపీ దర్శన టిక్కెట్ల జారీతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసిన సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. ఆలయానికి శాశ్వత ఈవోలేకపోవడం.. రాజకీయ పెత్తనం పెరిగిపోవడంతో ముందస్తు ఏర్పాట్ల నిర్వహణలో దేవదాయశాఖ పూర్తిగా విఫలమైంది.