News

రేపు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

202views

తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించి జూలై నెల కోటాను టీటీడీ గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలకా్ట్రనిక్‌ డిప్‌ కోసం ఏప్రిల్‌ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో భక్తులు నమోదు చేసుకోవచ్చు. అదే రోజు మఽధ్యాహ్నం 12 గంటలకు లక్కీడి్‌పలో టికెట్లు మంజూరవుతాయి. టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను కూడా 20వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన వీటిని కేటాయిస్తారు. మరోవైపు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి జూలై నెల ఆన్‌లైన్‌ కోటాను కూడా 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు జూలై నెలకు చెందిన అంగప్రదక్షిణ టోకెన్లనూ భక్తులు ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే 24వ తేదీన ఉదయం 10 గంటలకు వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి మే నెల కోటాను విడుదల చేయనున్నారు. కాగా, మే, జూన్‌ నెలలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్‌ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మే నెల గదుల కోటాను 26వ తేదీ ఉదయం 10 గంటలకు, తిరుపతిలోని గదుల కోటాను 27వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.