News

పట్టాలు తప్పిన రెండు గూడ్స్ రైళ్లు…ఆరుగురు రైల్వే ఉద్యోగులకు తీవ్ర గాయాలు

277views

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రెండు గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు లోకోపైలెట్లతో కలిసి ఆరుగురు రైల్వే ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.(Madhya Pradesh) షహదోల్ జిల్లాలో రెండు గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పాయి.(Two goods trains derail )బిలాస్ పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని సింగ్ పూర్ రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలు తప్పిందని రైల్వే అధికారి సాకేత్ రంజన్ చెప్పారు. బిలాస్ పూర్ -కట్నీ రైలు మార్గంలో ఐరన్ ఓర్ తో వెళుతున్న గూడ్స్ రైలు 8 బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పడం వల్ల ఈ మార్గంలో 10 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు హుటాహుటిన వచ్చి రిలీఫ్ ఆపరేషన్ ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.