
భారత్ భూభాగాలను ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నిస్తూ ఉంటుంది. లద్దాఖ్, సిక్కిం తదితర రాష్ట్రాల్లో వాస్తవాధీన రేఖ వెంట దురాక్రమణలకు పాల్పడుతూ ఉంది. గల్వాన్ లోయ (Galwan Valley)లో భారత్ భూభాగంలో ప్రవేశించిన చైనా ఆర్మీకి భారత్ సైనికులు ధీటైన జవాబు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఘటనపై ఓ పాన్ ఇండియా సినిమా రూపొందింది.
భారతీయులంతా తప్పక చూడాలి – వెంకయ్య నాయుడు
‘ప్రేమించుకుందాం రా’, ‘కలిసుందాం రా’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి హిట్ చిత్రాలకు రచయితగా పని చేసిన, ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్టు రైటరుగా పేరు తెచ్చుకున్న దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘భారతీయాన్స్’ గాల్వన్ ఘటన ఆధారంగా, భారతీయ సైనికుల వీరోచిత పోరాట పటిమ చూపించేలా రూపొందింది. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్గాస్ కథానాయకులుగా నటించారు. ఇందులో సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ కథానాయికలు.




