News

జమ్మూ కాశ్మీర్‌లో బైసాఖీ ఉత్సవాల్లో అపశృతి, కుప్పకూలిన వంతెన, పలువురికి తీవ్రగాయాలు

313views

జమ్మూకాశ్మీర్‌(Jammu and Kashmir)లో శుక్రవారం వంతెన ప్రమాదం జరిగింది. బైసాఖి ఉత్సవాల(Baisakhi Celebration) సందర్భంగా ఒక్కసారిగా వందలాది మంది వంతెన(Footbridge)పై చేరడంతో ప్రమాదం సంభవించింది. ఉద్ంపూర్ జిల్లాలోని బైన్ గ్రామం(Bain village)లోని బెనిసంగం(Beni Sangam) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూటీం సహాయక చర్యలు చేపట్టారని ఉదంపూర్ ఎస్ఎస్పీ వినోద్‌కుమారు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.