News

అగ్రరాజ్యంలో ముస్లింల ఆధిపత్యం? మొట్టమొదటి ముస్లిం మెజారిటీ నగరం ఖలీదా జియా

242views

క్రైస్తవులకు కేంద్రంగా ఉన్న అమెరికా రాజకీయాల్లో రానురాను ముస్లింల ప్రాబల్యం పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికాలో గత 20 ఏళ్లలో ముస్లిం నాయకుల ప్రభావం పెరిగిందని గణాంకాలను చెబుతున్నాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే అమెరికా దేశ జనాభాలో ముస్లిం జనాభా 1.1 శాతం మాత్రమే ఉ:ది. అయినప్పటికీ రాజకీయ ప్రభావం దేశంలో వారి జనాభాకంటే వేగంగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజాగా అమెరికాలో మొట్టమొదటి ముస్లి మెజారిటీ నగరం ఉద్భవించింది. దీనికి వారు ఖలీదా జియా అనే కొత్త పేరు పెట్టుకున్నారు. డెట్రాయిట్ మధ్యలో ఉన్న హ్యామ్‌ట్రామ్‌క్ నగరం అమెరికా రాజకీయ సామాజిక చిత్రపటంలో ముస్లిం నగరంగా పేరు సంపాదించుకుంది. ఒకప్పుడు పోలిష్ వలసదారులకు నిలయంగా ఉన్న ఈ నగరం నేడు అమెరికాలోనే మొట్టమొదటి ముస్లిం మెజారిటీ నగరంగా అవతరించింది.

మిచిగాన్ రాష్ట్రంలోని వేన్ కౌంటీలో ఉన్న ఈ నగరం 1900ల ప్రారంభంలో జర్మన్-అమెరికన్ రైతుల నివాసంగా ఉండేది. 1914లో డాడ్జ్ ఆటోమొబైల్ ఫ్యాక్టరీ ప్రారంభం కావడంతో వేలాది మంది కార్మికులు ఇక్కడికి తరలివచ్చారు. ముఖ్యంగా 20వ శతాబ్దంలో పోలిష్ (పోలాండ్) వలసదారులకు ఇది ప్రధాన కేంద్రంగా మారింది. . అయితే, 1990ల నుంచి యెమెన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి ముస్లిం వలసదారులు ఇక్కడికి రావడం మొదలైంది. చాలా తొందరగా వారి కమ్యూనిటీ ఇక్కడ వేగంగా వ్యాపించింది. 2020 జనాభా గణాంకాలతో పోలిస్తే ఇక్కడ మొత్తం 28,433 మంది ఉంటే వారిలో సుమారు 70 శాతం మంది ముస్లింలే నివసిస్తున్నారు. 2015లో నగర పాలక మండలి (సిటీ కౌన్సిల్)లో ముస్లింలు మెజారిటీ స్థానాలను గెలుచుకున్నారు ఇక 2022లో అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ఆల్-ముస్లిం సిటీ కౌన్సిల్ (అందరూ ముస్లిం సభ్యులే) ఇక్కడ ఏర్పాటైంది. ప్రస్తుతం మేయర్, పోలీస్ చీఫ్ మరియు కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలే

ఇటీవల హ్యామ్‌ట్రామ్‌క్ కౌన్సిల్, తన పరిధిలోని ‘కార్పెంటర్ స్ట్రీట్’ లో కొంత భాగాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా పేరుతో మార్చాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కౌన్సిల్‌లోని బంగ్లాదేశ్ సంతతికి చెందిన నలుగురు కౌన్సిలర్లు చొరవ తీసుకుని ఆమోదింపజేశారు. గతంలో ఇదే విధంగా షికాగోలో ఖలీదా జియా భర్త, దివంగత బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ పేరును ఒక వీధికి పెట్టారు.

నగరంలో ఒకప్పుడు పోలిష్ సంస్కృతికి చిహ్నాలుగా ఉన్న హోటళ్లు, దుకాణాలు ఇప్పుడు అరబిక్,రెస్టారెంట్లుగా మారిపోయాయి. సిటీ హాల్ వద్ద సైన్ బోర్డులు ఇంగ్లిష్‌తో పాటు అరబిక్, బెంగాలీ భాషల్లో కనిపిస్తాయి. ఇలా ఒక ప్రాంతం మొత్తం ముస్లింలు ఆక్రమించకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే మరోవైపు అమెరికాలో అక్రమ వలసలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతూ. ‘అక్రమ వలసలను అడ్డుకోండి’.. ‘మా దేశాన్ని మాకివ్వండి’ అంటూ నిరసనకారులు వీధుల్లో మొత్తుకుంటున్నారు. ఇక బ్రిటన్ లో సైతం అక్రమ వలసలు పెరగడం వల్ల ముస్లింల ఆధిపత్యం పెరుగుతోందని, తమ సంస్కృతి పూర్తిగా మారిపోతోందని అక్కడివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లింల వలసల వల్ల బ్రిటన్ కు ముప్పు తప్పదని, ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయకపోతే నాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు.