News

సంఘ నిషేధానికి సరైన కారణాలు చెప్పలేకపోతున్నారు : హోసబళే

130views

దేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను నిషేధించాలంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే స్పందించారు. జబల్ పూర్ వేదికగా మూడు రోజుల పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ ముగిసింది. ఈ సందర్భంగా శనివారం దత్తాత్రేయ హోసబళే మీడియాతో మాట్లాడారు.

ఈ సమయంలో విలేకరులు ఖర్గే వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా… ఇలాంటి ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయని గుర్తు చేశారు. అయినప్పటికీ.. సంఘ (ఆరెస్సెస్) కార్యం పెరుగుతూనే వుందన్నారు. అలాగే ఇలాంటి నిషేధాలు రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టులు కూడా పేర్కొన్నాయనిహోసబళే చురకలంటించారు.

సంఘ్ ని నిషేధించాలంటూ పదే పదే డిమాండ్లు చేసేవారు దానికి సరైన కారణాన్ని కూడా చెప్పలేకపోతున్నారని అన్నారు. సమాజం ఎప్పుడు కూడా ఇలాంటి నిరాధారమైన డిమాండ్లను అస్సలు పట్టించుకోనే లేదని తేల్చి చెప్పారు.