ArticlesNews

శ్రీకృష్ణుడు గోవులను పూజించిన రోజు

155views

కార్తిక శుక్లపక్ష అష్టమి.. అంటే దీపావళి అమావాస్య ఎనిమిదో రోజును గోపాష్టమి అంటారు. గోపాలుడు గోవును పూజించిన శుభదినమిది. శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజిది. అందుకే ఈ పుణ్యదినాన ఆవులను పూజించటం మంచిదని పురాణాలు పేర్కొన్నాయి.

గోపాష్టమి ఎలా చేస్తారంటే…
ఈ ప్రత్యేక రోజున గోవు లను శుభ్రంగా కడిగి, పసుపు రాసి.. కుంకుమ దిద్ది అలంకరించాలి. అరటిపండ్లను నైవేద్యంగా పెట్టాలి. హారతులిచ్చి గోవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి. గోవు తోక భాగాన్ని స్పృశించి, ‘శ్రీసురభ్యై నమః’ అనే మంత్రాన్ని స్మరిస్తూ నమస్కరించాలి. నిత్యం ఆవులను పూజించినప్పటికీ ఈ రోజున విశేషంగా ఆరాధిస్తారు. గోవు సకల దేవతా స్వరూపం కనుక గోవును పూజిస్తే ముక్కోటి దేవతలూ దీవిస్తారని, గోమాతను పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలూ చేకూరతాయని విశ్వసిస్తారు. గోపాష్టమి రోజున గోవులకు గ్రాసాన్ని, నానబెట్టిన గోధుమలను సమర్పిస్తే.. కోరిన కోర్కెలు నెరవేరుతాయని పండితులు చెబుతారు.