ArticlesNews

“అల్లాహ్ లేకుండా అద్భుతం”

887views

త్తర అమెరికాలోని మాజీ ముస్లింలు “అల్లాహ్ లేకుండా అద్భుతం” ప్రచారాన్ని ప్రారంభించారు, కానీ ఆ పదాలను బోర్డ్‌లలో ఉంచడానికి అనుమతి లేదు

ఉత్తర అమెరికా మాజీ ముస్లింలు (EXMNA) అట్లాంటా, చికాగో మరియు హ్యూస్టన్ నగరాల్లో కొన్ని బోర్డులను ఏర్పాటు చేశారు-ప్రాథమికంగా అమెరికాలో పెరిగిన ముస్లింలలో గణనీయమైన సంఖ్యలో మతభ్రష్టులు అయ్యారని, కానీ అది సరైనదేని పరోక్షంగా ధృవీకరిస్తున్నారు (వాస్తవానికి , చాలామంది ముస్లింల దృష్టిలో మతభ్రష్టత్వం మరణ శిక్ష వేయదగిన నేరం). EXMNA ప్రకటన ప్రకారం, వారు ఇలా చెయ్యడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

మతపరమైన సున్నితత్వం దృష్ట్యా బోర్డుల ఏర్పాటుకు కంపెనీల నుండి అనేక సార్లు తిరస్కరణలు ఎదురయ్యాయి. అనేకసార్లు మార్పులు లేదా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వంటివి జరిగిన తర్వాత  2019 సెప్టెంబర్ 3 మరియు 4 తేదీలలో మంగళవారం మరియు బుధవారం బోర్డ్‌లు ఏర్పాటు చెయ్యబడ్డాయి.

“దాదాపు డజను ముస్లిం-మెజారిటీ దేశాలలో, మాజీ ముస్లింలకు మరణశిక్ష విధించాలన్న డిమాండు వినిపించింది.” అని ఉత్తర అమెరికా మాజీ ముస్లింల అధ్యక్షుడు ముహమ్మద్ సయ్యద్ అన్నారు. “పాశ్చాత్య దేశాలలో, మా ఉనికి నేరం కాదు, కానీ మా స్వంత కుటుంబాలు మరియు పూర్వ విశ్వాస సమాజం నుంచి వెలివేతను, బెదిరింపులను ఎదుర్కొంటున్నాము. చాలామంది మాజీ ముస్లింలు అల్లా పై తమ అపనమ్మకాన్ని దాచడానికే ప్రయత్నించటం ఆశ్చర్యకరమేమీ కాదు. కానీ సిగ్గు, భయం లేకుండా బహిరంగంగా బయటకు రావడమే అంగీకారం పొందటానికి మొదటి అడుగు.

“మాజీ ముస్లింలు ఒంటరి వారు కారని వారు తెలుసుకోవాలని మేం కోరుకుంటున్నాము” అని ఉత్తర అమెరికా మాజీ ముస్లింల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారా హైదర్ అన్నారు. “వారు నిర్భయంగా బయటకు రావటానికి సిద్ధపడితే సొరంగం చివర వారి కోసం ఒక కాంతి ఉందని వారు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మీరు మీ జీవితాన్ని పునర్నిర్మించవచ్చు మరియు మతం నుండి స్వేచ్ఛ పొందడంలో ఆనందం పొందవచ్చు. ” అని ఆయన పేర్కొన్నారు.

సయ్యద్, హైదర్ మరియు వారి సహచరులు ఉపయోగకరమైన మరియు సాహసోపేతమైన పని చేస్తున్నారు. వారు ఒక బోర్డ్‌ను ఉంచారు. క్రైస్తవులలో కూడా అధిక శాతం అవిశ్వాసులుగా మారారు. కానీ వారు ఈ  విధమైన తిరస్కరణకు, వ్యతిరేకతకు, ఒత్తిడికి గురయ్యే అవకాశం లేదు. మనందరికీ తెలిసినట్లుగా, క్రైస్తవుల కంటే ముస్లింలను ఎదుర్కోవడం చాలా ప్రమాదకరం.

బోర్డ్‌లు ప్రదర్శించడంలో ఇబ్బంది గురించి ఈ పేజీ మరిన్ని వివరాలను ఇస్తుంది:

కొన్ని నెలల పాటు ప్రణాళికలు వేసి తయారు చేసిన బోర్డులను మతపరమైన సున్నితత్వం దృష్ట్యా కొన్ని సంస్థలు వాటిని ఏర్పాటు చెయ్యడాన్ని లెక్కలేనన్ని సార్లు తిరస్కరణలను ఎదుర్కోవలసి వస్తుంది. దురదృష్టవశాత్తు, ఈ ప్రక్రియ మా సందేశాల తీవ్రతను గణనీయంగా తగ్గించింది. మా బోర్డ్‌లు మతపరమైన వాదనలను సవాలు చేయడం నుండి మా ఉనికి గురించి సరళమైన ప్రకటనలకు మరలాయి. మా మొదటి సంస్కరణలు, ప్రకటనలు చాలా తిరస్కరించబడ్డాయి. ప్రతిపాదిత హ్యాష్‌ట్యాగ్‌లు కూడా తిరస్కరించబడ్డాయి. అలాగే ప్రచురణలో ఎక్కువ ఆలస్యం జరుగుతుందనే భయంతో, “అల్లాహ్ లేకుండా అద్భుతం” హ్యాష్‌ట్యాగ్‌ను పూర్తిగా బోర్డ్‌ల నుండి తొలగించాలని మేము నిర్ణయించుకున్నాము.

మేము రూపొందించిన మరియు ప్రతిపాదించిన బోర్డ్‌లలో అత్యంత వివాదాస్పదమైనది ఇస్లామిక్ పౌరాణిక వ్యక్తి యొక్క చిత్రం “బురాక్”. ఈ బొమ్మ స్త్రీ ముఖం, గాడిద శరీరం, రెక్కలు మరియు నెమలి తోకతో ఉంటుంది. మతపరమైన పురాణాల యొక్క అసంబద్ధతను ఎత్తిచూపడం ద్వారా విమర్శనాత్మక ఆలోచనను రేకెత్తించాలనే ఆలోచనలోంచి వచ్చిన చిత్రమది. అయితే, మేము పనిచేసిన అన్ని కంపెనీలు ఈ భావనను తిరస్కరించాయి. కార్టూన్ తిరస్కరణ చాలా బాధ కలిగించే అంశం. నిజానికి దాని ప్రచురణను తిరస్కరించడం వెనుక ఉన్న వారి భయం ఆశ్చర్యం కలిగించదు. చార్లీ హెబ్డో వంటి కార్టూనిస్టుల హత్యలు మరియు డానిష్ కార్టూనిస్టులపై దాడులు వంటి హింసతో డ్రాయింగ్‌కు ఉగ్రవాద ముస్లింలు సమాధానం ఇచ్చినట్లు రికార్డు ఉంది కదా?

అయినప్పటికీ, సాధ్యమైనంత తేలికపాటి సందేశాన్ని ఎంచుకున్న తర్వాత కూడా, ఒప్పందాలలో ఒకటి రద్దు చేయబడింది. మా బోర్డ్ మసీదుకు ఎంత దగ్గరలో ఉందో కంపెనీ గ్రహించలేదు. దానిని గ్రహించిన తర్వాత వారు మా మధ్య జరిగిన ఒప్పందాన్ని గౌరవించలేమాని మాకు చెప్పారు.

మాజీ ముస్లింల విశ్వాసం నుండి బయటకు  రావడాన్నివివరించే అనేక చిన్న వీడియోలు (“మినీ-డాక్యుమెంటరీలు”) వారి సైట్‌లో ఉన్నాయి. ఇక్కడ చాలా మందిలో ఒకరు, “తన టీనేజ్ చివరలో ఇస్లాం మతంలోకి మారిన కెనడియన్ మహిళ స్టెఫానీ లిబియా ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది.”

లిబియాకు తిరిగి వెళ్ళడానికి ఆమె భర్త ఆమెను ఎలా మోసగించాడో, ఐదు సంవత్సరాల పాటు ఆమెకు తన కుమార్తెలను చూపించకుండా ఏ విధంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడో ఆమె వివరించినప్పుడు ఒక తల్లి యొక్క వేదనను మీరు అర్ధం చేసుకోవచ్చు. ఆమె వేదన హృదయ విదారకం. కన్నీరు పెట్టకుండా మీరు ఆ వీడియోని చూడాల్సిందిగా నేను అభ్యర్ధిస్తున్నాను.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.