News

నవ భారత నిర్మాణానికి ముందడుగు వేద్దాం

422views

స్వామి వివేకానంద కలలు కన్న నవభారత నిర్మాణానికి యువకులు ముందడుగు వేయాలని మాచర్ల శ్రీ రామకృష్ణసేవా సమితి అధ్యక్షుడు మెట్టు గోవిందురెడ్డి పిలుపునిచ్చారు.పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని తుమృకోట గ్రామంలో సమితి శాఖను ప్రారంభించి మాట్లాడారు. విజయవాడ రామకృష్ణ మిషన్‌ స్వామీజీల ఆదేశాల మేరకు రామకృష్ణ, శారదామాత, స్వామి వివేకానందల భావజాలాన్ని ప్రజలలోకి తీసుకెళ్లేందుకు గ్రామాలలో ఈ సేవా శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తుమృకోట నూతన కమిటీని నియమించారు.