News

పంచారామాల బస్సులు సద్వినియోగం చేసుకోవాలి

282views

కార్తీకమాసంలో పుణ్యక్షేత్రాలైన పంచారామాలను సోమవారం ఒకేరోజు దర్శించుకునేలా ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ఆర్టీసీ ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్‌ఎస్‌ శర్మలు పిలుపునిచ్చారు. పంచారామాల బస్సులను శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి పంచారామాల ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటల్లోని శివాలయాల దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 24 తేదీన కూడా పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. 17న ఒక్కరోజే శ్రీకాకుళం ఒకటవ డిపో నుంచి ఒక బస్సు, శ్రీకాకుళం రెండో డిపో నుంచి రెండు బస్సులు, టెక్కలి డిపో నుంచి ఒక బస్సు కలిపి మొత్తం నాలుగు బస్సులు బయలుదేరినట్లు తెలిపారు. ‘ఒక్క ఫోన్‌ కాల్‌ తో మీ వద్దకు ఆర్టీసీ బస్సు‘ అనే నినాదంతో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9959225608, 9959225609, 9959225610, 9959225611 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్లు వి.రమేష్‌, ఎ.గంగరాజు, టెక్కలి అసిస్టెంట్‌ మేనేజర్‌ పీఎస్‌ఎన్‌ మూర్తి, ఓపీఆర్‌ఎస్‌ సూపర్‌వైజర్‌ ఎండీఏ బాషా, ప్రసాద్‌, ఎంపీ రావు, మురళి, ఆర్టీసీ సెక్యూరిటీ విభాగం ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, ప్రసాదరావు పాల్గొన్నారు.