
409views
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి నివేదించే అన్నప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్యామలారావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేశారంటూ, దిట్టం పెంచినట్టు పుకార్లు సృష్టిస్తున్నారని..ఇది పూర్తిగా అవాస్తవమన్నారు.ఇటువంటి అవాస్తవ వార్తలు నమ్మవద్దని భక్తులకు ఆ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.




