కేరళలో ఓ ఆలయం వద్ద జంతు బలి జరిగినట్లు గురువారం కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. తనతో పాటు సీఎం సిద్ధరామయ్య, మరికొంత మందిని టార్గెట్ చేస్తూ శత్రు భైరవి యాగం నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా జంతు బలి కూడా చేస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు. ఆ ఆరోపణలను ఇవాళ కేరళ సర్కారు ఖండించింది. కర్నాటక డిప్యూటీ సీఎం ఆరోపించినట్లుగా కేరళలోని ఆలయాల్లో ఎటువంటి జంతుబలి జరగలేదని ప్రభుత్వం పేర్కొన్నది. కన్నురూ జిల్లాలోని రాజరాజేశ్వరి ఆలయంలో జంత బలి జరిగినట్లు కర్నాటక డిప్యూటీ సీఎం ఆరోపించారని, కానీ దాంట్లో వాస్తవం లేదని కేరళ దేవాదాయశాఖ మంత్రి కే రాధాకృష్ణన్ తెలిపారు. శివకుమార్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టామని, దీని కోసం మలాబార్ దేవస్థానం బోర్డును సంప్రదించామని, ప్రాథమిక రిపోర్టు ప్రకారం అలాంటి ఘటనలు జరగలేదని తేలినట్లు మంత్రి వెల్లడించారు. దేవస్థానం బోర్డు కన్ఫర్మ్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే కర్నాటక డిప్యూటీ సీఎం ఎందుకు ఆ ఆరోపణలు చేశారో తేలాల్సి ఉందన్నారు. కేరళలోని ఇతర ఆలయాల్లో ఎక్కడైనా జంతు బలి జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. 1968 నుంచి జంతుబలులు నిషేదించారని, శివకుమార్ ఆరోపణలు వంద శాతం అబద్ధమని మంత్రి పేర్కొన్నారు. అఘోరాలతో శత్రు భైరవి యాగం నిర్వహిస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు. కానీ ఆ యాగం ఎవరు చేయిస్తున్నారన్న విషయాన్ని ఆయన చెప్పలేదు.
303views
You Might Also Like
కాక్రోచ్ పార్టీకి ‘‘బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ మద్దతు
నీట్ ప్రశ్నా పత్రం లీకైన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఛలో...
ప్రాచీన విద్యా వ్యవస్థ వైభవోపేతం : కృష్ణ గోపాల్
9
ప్రాచీన భారత్‌లో విద్య పూర్తిగా ఉచితంగా లభించేదని, గురుకులాల్లో విద్యార్థులకు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా ఆహారం, దుస్తులు, మందులు మరియు పుస్తకాలు అందేవని రాష్ట్రీయ స్వయంసేవక్...
విశ్వవ్యాప్తం.. హిందుత్వం చివరి భాగం
విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం ఇక్కడ చదవచ్చు విశ్వవ్యాప్తం.. హిందుత్వం 2వ భాగం ఇక్కడ చదవచ్చు విశ్వవ్యాప్తం.. హిందుత్వం 3 వ భాగం ఇక్కడ చదవచ్చు...
ఖతార్ ఇస్లామిక్ ఉగ్రవాదానికి మూలకేంద్రం
8
మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా ఆల్ థానీ పాలనలో ఖతార్ తన అపార ఆర్థిక వనరులు, ప్రభుత్వ వ్యవస్థలు, మీడియా నెట్‌వర్క్‌ను ఇస్లామిస్ట్ ఉద్యమాలను...
హిందూ ధర్మంపై ‘విద్వేషపు’ పడగ
సమాజంలో ‘భావప్రకటన స్వేచ్ఛ’ ముసుగులో హిందూధర్మం, దేవతలపై ప్రణాళిక ప్రకారం కుట్రపన్ని విద్వేషాన్ని చిమ్ముతున్నారు. కొందరు విద్రోహశక్తులు భారతదేశాన్ని, అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ను తమ విభజనవాద రాజకీయాలకు...
భోజ్‌శాలపై ముస్లింల పిటిషన్.. శుక్రవారం విచారిస్తామన్న సుప్రీం
29
మధ్యప్రదేశ్‌లోని భోజ్ శాల ఆలయ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. కాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ స్థలానికి సుమారు 2కి.మీ. దూరంలో మసీదుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని...





