News

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

247views

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జేకేలోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు కూడా గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. బారాముల్లా జిల్లాలోని మొహల్లా నౌపోరా ప్రాంతంలో బలగాలు తనిఖీలు చేస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

ఉత్తర కశ్మీర్‌లో గురువారం రాత్రి ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన ఇద్దరు సైనికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పౌరుడు కూడా గాయపడ్డాడని తెలుస్తోంది.